తల్లిదండ్రులు పూజ్యులు:- -గద్వాల సోమన్న,-9966414580
త్యాగమయులు కన్నవారు
ధరణిలోన మిన్న వారు
తీర్చలేము వారి రుణము
అక్షరాల ఇదే నిజము

మన జన్మకు కారకులు
ఘన జీవిత సారథులు
వెలుగునిచ్చే దీపాలు
ప్రేమకు ప్రతిరూపాలు

కన్నవారిని సేవించు
ఇలవేల్పులని భావించు
వృద్ధాప్యంలో వారిది
నీ బాధ్యతని  గుర్తించు

కన్న ప్రేమ తూచలేరు
దానికేది సాటి రాదు
కనిపించే దేవుళ్ళు
పరికించి తల్లిదండ్రులు

అమ్మానాన్నలు పూజ్యులు
గౌరవానికిల అర్హులు
నిర్లక్ష్యమే చేస్తే
ఉండవోయి! దీవెనలు


కామెంట్‌లు