నిత్య సత్యాలు:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
మాటలతో మనసులు
చేయరాదు ముక్కలు
బ్రతుకులతో  ఆటలు
ఆడరాదు ఎన్నడు

పగలు,ప్రతీకారాలు
బ్రతుకులు దహించు జ్వాలలు
దూరంగా ఉంటే మేలు
లేక కూల్చు కుటుంబాలు

చుట్టాల్లాంటివి ఇడుములు
పలకరించి పోతాయి
హైరానా పడరాదు
గుండెలు బాదుకోరాదు

నిరాశ లోయ భీకరము
ఎప్పుడు అందుండరాదు
సానుకూల దృక్పథం మేలు
బ్రతుకున కల్గియుంటే చాలు


కామెంట్‌లు