నోటితో జాగ్రత్త!:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
హద్దులో ఉంటేనే
బంధాలే! పదిలము
లేకుంటే మాత్రము
జీవితాలు ఛిద్రము

నోటితో జాగ్రత్త!
తెచ్చిపెట్టును కీడు
దాన్ని నియంత్రిస్త
భువిలో మగధీరుడు

నోరు జారితే ముప్పు
కుటుంబాలకు నిప్పు
మాట్లాడే ముందే
ఆలోచిస్తే ఒప్పు

వ్యర్ధమైన మాటలు
దాటునోయి! కోటలు
వాటి వలన నష్టము
బ్రతుకులగును శిథిలము


కామెంట్‌లు