అమ్మ హితవు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
తావులీనును పుష్పము
వెలుగులిచ్చును దీపము
పరిశోధన చేయగా
చిత్రమైనది విశ్వము

దౌడు తీయును అశ్వము
స్థిరము కానిది హృదయము
భగవంతుని సృష్టిలో
చూడ ఎన్నో వింతలో!

అందమైనది పద్మము
మనసు దోచును పద్యము
రెండు కూడా హృద్యము
ఉంది వాటి అవసరము

కష్టపడితే ఫలితము
ఉండునోయి! ఖచ్చితము
చెరువునోయి!బద్దకము
ఉంచుమోయి! ఇక దూరము

జీవితమే సంగ్రామము
ఓడితే! సంక్షోభము
అభ్యాసంతో విజయము
అగును పాదాక్రాంతము

సానుకూల దృక్పథము
కల్గియుంటే క్షేమము
గెలుపుకు సోపానము
తెలుసుకొమ్ము ఈ నిజము


కామెంట్‌లు