తల్లి ప్రేమ గొప్పది:- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,9966414580.
తల్లి ప్రేమ గొప్పది
మల్లెలా తెల్లనిది
ఉన్న దాని కన్నా
మిన్నగా ఉండునది

మచ్చ మాత్రముండదు
అచ్చంగా ముత్యము
పచ్చని పైరు విధము
స్వచ్ఛమైన కనకము

స్వార్థమే ఎరుగనిది
అర్థవంతమైనది
తీర్ధాన్ని పోలినది
వ్యర్థమసలు కాదది

త్యాగానికి చిహ్నము
తల్లి ప్రేమ మాత్రము
జీవకోటికిలలో
వర్తించే సూత్రము

అమ్మ మనసు చల్లన
అమృతములా తీయన
ఆమె లేక వేదన
ఎక్కడుండు స్వాంతన!

రక్షణ ప్రాకారము
దొడ్డది మమకారము
అమ్మ కామధేనువు
ఆమెకు సాటి లేవు


కామెంట్‌లు