చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 మత్తకోకిల*
చెట్టు కొమ్మల దూరి దారము చెంబునందున మాటలై
గట్టిగా చెవికింపు దూరము కల్గి దగ్గర శబ్దమై
పట్టినందున చేతి జారక పట్టుగొమ్మల సందడుల్
జట్టు నవ్వుల రెమ్మ పచ్చని సందడౌ గణ ముచ్చటల్


*కందం*


ఆటల సందడి జేయగ
పాటల గిలిగింతలైన పచ్చని కొమ్మల్
మాటల చరవాణి డబ్బ
తూటాల లొల్లి గలగల తాండవమాడున్
కామెంట్‌లు