ఆమె ...సంరక్షణలో ...!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.
 అక్కా ..అక్కా ..అంటూ 
వెంటపడతాడు 
బయటకి వెల్దాము అని 
మారాము చేస్తాడు 
అయిదు అయితేచాలు 
తోపుడు చక్రాలబండి 
చూపించి 
పోదాం పద అన్నట్టు 
సైగచేస్తాడు ....!
'ప్రవళిక' పలికించే 
ప్రతిపదమూ ముద్దు ముద్దుగా 
పలుకుతాడు -
ఇష్టంలేని టి.వి .ఛానల్ 
పొరపాటున పెడితే 
అన్నంతినకుండా 
మంకుపట్టుపట్టి 
అనుకున్నది సాదిస్తాడు !
సంరక్షకురాలు ' ప్రవల్లిక 'ను 
ముప్పుతిప్పలు పెడతాడు 
అయినా --
ఆమెప్రేమను -
మెండుగాపొందుతాడు 
మాముద్దుల నివిన్ బాబు !!
                  ***

కామెంట్‌లు