సుప్రభాత కవిత : -బృంద
అంతర్ముఖమై చూసుకున్న 
మనసులో...

అపుడపుడు గుర్తొచ్చే 
అవమానాలు..
అంతలోనే  సంబరాలు 
చేసుకున్న క్షణాలు 

ఆనందంగా గంతులేస్తూ 
గడిపిన గతాలు 
అందరితో కలిసి ఆత్మీయంగా 
నవ్విన నవ్వులు 

గుచ్చి బాధించే కొదవల 
తాలూకు ముళ్ళు 
గుర్తొచ్చి చెలమల్లా 
నిండుకునే కళ్ళు 

గుండెలో నిండుకుని 
బాధించే గుబుళ్ళు 
గమనంలో  ఆలస్యానికి 
కారణమయె దిగుళ్ళు

ఏవి ఎన్ని ఎంత 
ఏడిపించినా 
ప్రశాంతంగా భరించిన 
సహనాలు

ఉలిదెబ్బల్తో రూపుదిద్దుకున్న 
శిలలాటి  మనసుతో 
వెలివేసి చింతలను దరికిరానీక 
మెలకువగా వేసిన అడుగులు

అన్నిటిని అడుగుపొరలలో
అలవోకగా దాచేసి 
రేపటికోసం  చీకటి రెప్పల తెర 
తొలగించే వెలుగుల కోసం 

ఎదురుచూస్తూ 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు