నీటినీ వృధా చేయకూడదు:- బి.నందిని-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా  ఒక   ఊరిలో  శిరీష,దుర్గ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్లలో శిరీష తరచూ నీటితో ఆటలాడడం చేసేది, నీటిని   పారబోస్తూ ఉండేది, దుర్గ  శిరీషకు నీటిని పారబోయొద్దని   ఎంత చెప్పినా, వినిపించుకోలేదు,ఒకరోజు  దుర్గా,ఒక పందెం వేసింది,ఆ పందెంలో ఓడిపోయిన వాళ్లు,  గెలిచిన వాళ్లు,చెప్పింది  చెయ్యాలి,అని చెప్పింది అందుకు శిరీష సరే అన్నది, పందెంలో దుర్గా గెలిచింది, శిరీష పందెంలో ఓడిపోయింది, శిరీషతో,నేను చెప్పింది చెయ్యి  అన్నది దుర్గ, ఒకరోజు మొత్తం  నీటిని  తాగకుండా ఉండాలి. అన్నది దుర్గ, అందుకు  సరేనన్నది శిరీష. కొంతసేపటి వరకు బాగానే ఉంది,కానీ  కొద్దిసేపటి తర్వాత శిరీషకి  చాలా దాహం  వేసింది,  దుర్గాకు తెలియకుండా నీళ్లు  తాగుదాం,అనుకుంది కానీ దుర్గ చూసి,నువ్వు నీళ్లు తాగొద్దు, ఈరోజు మొత్తం అన్నది, కొద్దిసేపటి తర్వాత శిరీష  కళ్ళు తిరిగి పడిపోయింది,దుర్గ తనను చూసి,తనమీద నీళ్లను చల్లి  లేపింది,తనకు కొన్ని నీళ్లు తాగమని ఇచ్చింది,శిరీష  నీళ్లను తాగి,దుర్గ నాకు నీళ్ల విలువ  తెలిసింది అని   అన్నది...

 ఈ కథలోని నీతి : నీటిని  మనం వృధా  చేయకూడదు ఇతరులని  వృధా చేయనీయకూడదు..

కామెంట్‌లు