నీ విలువెంత....!? -కోరాడ నరసింహా రావు!

 నిన్ను వెల కట్టగల ధనికుడు గాని, మేధావి గాని ఈ ప్రపంచం లో ఎవ రూలేరు...! 
     నిన్ను వారు వినియోగించుకోగలిగేవారి వారి స్థాయిలనిబట్టే నీ విలువను నిర్ణయించ గలిగేది...! 
నీ విలువ వే రెవరికో గాదు నీకు గూడా తెలియదు...! 
 నీకు లభించిన తాత్కా లిక గెలుపోటము లను బట్టి నీ విలువ , అదే... ఇదే.. అని భ్రమపడ తుం టావు..! 
  నిజానికి ఆ సర్వేశ్వరుడు నిన్ను ఈ సృష్ఠి సమస్తము లోనూ...అత్యున్నత ప్రాణి గా..,సర్వశక్తిసంపన్నునిగా పంపించాడు...! 
    ఈ మాయా జగతికి మోహితుడవై కర్మ బంధ ములో చిక్కి... కర్మ,జన్మ...  జన్మ, కర్మ...నీ అపార 
శక్తులను కోల్పోయి... పునరపి జన నం - పునరపి మరణం!! 
  నీ నిజ విలువను నీవు తెలుసుకో గలిగితే.... 
   ద్వంద్వములుండవు ! 
  అంతా ప్రేమ మయం! 
  ఆనందార్ణవం...!! 
    *****

కామెంట్‌లు