మనవరాలు ఆన్షి ..కి
తమ్ముడు పుట్టాడు ....!
ఆ ..ఆనందం
ఆమెముఖంలో స్పష్టం !
ఆడుకోడానికి ...
ఆనందం పంచుకోడానికి
అల్లరి చెయ్యడానికి
తమ్ముడు నివిన్ పుట్టాడు !
' నికో ' ముద్దుపేరుతో ...
అక్కకు దగ్గరయ్యాడు ,
అందరికి
ముద్దులబాబయ్యాడు !
తమ్ముడు పుట్టాడని
తనవిలువ తగ్గిపోతుందని
తనపై తల్లిదండ్రుల ప్రేమ
సన్నగిల్లుతుందని .....
అక్క ఆన్షి ఈర్శ్య పడబోదు !
దానికి ....
ఆమె ముఖారవిందమే
అసలలైన సాక్ష్యం ....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి