మంచు తడిసిన పూపరావలయం:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పుష్పాలంకరణలో 
తడిసింది మంచుచినుకు లేతగా
కేసరాల దారుల గుత్తుల నారింజ 
తడితడి వొడిలో అలరించె 

అమ్మ చేతుల మెత్తన పువ్వు 
నునువెచ్చ ఎదల నవ్వే
నిలువుగా నిటారుగా నింగి తాకే
పుష్పరూపసి వలయంలో 
తలవంచి భూమాతను మొక్కింది
గర్వంగ పరావలయ పూలకక్ష్యలో 


కామెంట్‌లు