ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలను కల్పిస్తున్నామని మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పిల్లల సౌకర్యార్థం బోర్వెల్ మంజూరు చేయగా, శుక్రవారం మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తో కలిసి ఆయన బోర్వెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార, శాస్త్రీయ విద్యను అమలు చేస్తున్నామన్నామని, సుశిక్షితులు, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపకులతో పిల్లలకు ఉచిత గుణాత్మక విద్యను అందిస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వ ఉచిత సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊశన్నల్లి పాఠశాల పిల్లల్ని చదువు, ఆటపాటలతో పాటు అన్ని అంశాల్లో అద్భుతంగా తయారు చేస్తున్నామన్నారు. ఊశన్నపల్లి గ్రామంలోని తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోకుండా ఉచిత నాణ్యమైన విద్యను అందించే ఊషన్న పల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్ పెండ్లి సరూప, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, పుర ప్రముఖులు, నాయకులు, గ్రామస్తులు పిల్లలు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు:-ఎంఈఓ సిరిమల్ల మహేష్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి