నీవొక రెండు నెలల్లో మరణిస్తావట!
పరీక్షలన్నీ చేసి చెప్పారు.
నీ కోరికలన్నీ తీర్చమన్నారు.
మనసు విప్పి మాట్లాడమన్నారు.
నన్నొదలి వెళ్ళడం ఖాయం అయిపోయాక,
కాళ్ళ కింది భూమి కదిలిపోతున్నట్లుంది.
నీ రూపం నీ ప్రేమలో కలిసి శాశ్వతమవుతున్నది.
నీ నిష్క్రమణ తెలిసాక,
నిన్న నిజమై,నేడు దుఃఖమై
రేపు గోచరమవుతున్నది.
భవబంధాలు నువ్వు తెంపుకొనే వేళ
ఆసన్నమవుతున్నదని ఖచ్చితంగా తెలిసాక,
జీవితం రెండయింది.
నీ తర్వాతి జీవితం కళ్ళముందు కనబడుతున్నది.
నన్ను భరిస్తావనుకుంటే,
నీవు కనబడకుండా పోతావా?
నీ నుదుటి మీది బొట్టులా నేనుందామంటే,
నీవే చిత్రపటమెక్కుతావా?
నా చేతుల్లోనే పోతానని భీష్మించి కూర్చున్నావా?
నీవు లేని లోకంలో ఉండేదెట్లా?
నా కన్నీళ్ళు వెచ్చగా నీ మోమును అభిషేకిస్తుంటే,
నిశ్చలమైన నీ శరీరం నన్ను దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే,
మరణం ఋణం తీర్చుకోమంటున్నది.
చేతిలో చెయ్యేసి నేనూ వస్తా పద!
పరీక్షలన్నీ చేసి చెప్పారు.
నీ కోరికలన్నీ తీర్చమన్నారు.
మనసు విప్పి మాట్లాడమన్నారు.
నన్నొదలి వెళ్ళడం ఖాయం అయిపోయాక,
కాళ్ళ కింది భూమి కదిలిపోతున్నట్లుంది.
నీ రూపం నీ ప్రేమలో కలిసి శాశ్వతమవుతున్నది.
నీ నిష్క్రమణ తెలిసాక,
నిన్న నిజమై,నేడు దుఃఖమై
రేపు గోచరమవుతున్నది.
భవబంధాలు నువ్వు తెంపుకొనే వేళ
ఆసన్నమవుతున్నదని ఖచ్చితంగా తెలిసాక,
జీవితం రెండయింది.
నీ తర్వాతి జీవితం కళ్ళముందు కనబడుతున్నది.
నన్ను భరిస్తావనుకుంటే,
నీవు కనబడకుండా పోతావా?
నీ నుదుటి మీది బొట్టులా నేనుందామంటే,
నీవే చిత్రపటమెక్కుతావా?
నా చేతుల్లోనే పోతానని భీష్మించి కూర్చున్నావా?
నీవు లేని లోకంలో ఉండేదెట్లా?
నా కన్నీళ్ళు వెచ్చగా నీ మోమును అభిషేకిస్తుంటే,
నిశ్చలమైన నీ శరీరం నన్ను దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే,
మరణం ఋణం తీర్చుకోమంటున్నది.
చేతిలో చెయ్యేసి నేనూ వస్తా పద!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి