కవితామృతం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అల్లితే
అక్షరాలు
ఆకర్షించాలి
విన్యాసాలు

పేర్చితే
పదాలు
పంచాలి
పసందులు

బయటపెడితే
భావాలు
మురిసిపోవాలి
మదులు

కూర్చితే
కలాలు
చేర్చాలి
ఉల్లాసాలు

నింపితే
కాగితాలు
తలపించాలి
నిజాలు

చదివితే
కవితలు
చూపాలి
చక్కదనాలు

పాడితే
గేయాలు
వీనులకివ్వాలి
విందులు

కదిలితే
పెదాలు
చిందాలి
తేనెచుక్కలు

రాస్తే
కవులు
పరవశించాలి
పాఠకులు

తలిస్తే
ఙ్ఞాపకాలు
తట్టాలి
అనుభూతులు

తగలగానే
కవనాస్త్రము
పైకుబకాలి
గంగాజలము

అప్పుడే
కవనాలు
అవుతాయి
అమృతము

ఆరోజే
కవులు
అవుతారు
చిరంజీవులు

ఆనాడే
కవితలు
అయిపోతాయి
అమరము


కామెంట్‌లు