వారిని చూస్తుంటే
మనసు చెదిరింది.
మమతా కరిగింది
నాన్న లేడు
అమ్మ లేదు
అమ్మమ్మ
నానమ్మ
తాతయ్యలు లేరు
నా అనే వారు ఎవరూ లేరు.!!
పొద్దున నిద్ర లేపే ముద్దులు లేవు.
సంధ్య వేళ ఆటలాడే అన్నలేడు.
రాత్రి నిద్రపుచ్చే కథలు లేవు
గోరుముద్దలు లేవు
అలక పాన్పులు లేవు
అర్ధరాత్రి అమ్మకోసం తడిమితే
పక్కన ఎవరూ లేరు
దెబ్బతిని ఏడిస్తే ఊరడించేవారు లేరు.
వారికి బాల్యమే లేదు.!!
ఎవరూ లేరు
వారికి ఎవరూ లేరు
భవిష్యత్తు అంతకన్నా లేదు
తాము చేసిన తప్పేమో తెలియదు.
అయినా అలవి గాని శిక్ష ఎందుకో తెలియదు.
అన్యాయమైపోయిన బాలలకు
ఆసరా ఎవరు!!?
మనం కాలేమా.!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి