జిందా ....జిందాబాద్ ..!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 సర్వరోగ నివారిణి 
ఘాటైన వాసన 
జిందాతిలిస్మాత్ !
ఈవాసనకు -
చాలమంది పిల్లలు 
దూరంగ పారిపోతారు 
ఎవరూచూడకుంటే 
సీసానే మాయంచేస్తారు ,
జలుబుచేస్తే --
ఛాతికి ..వీపుకు పూస్తారని 
వాళ్ళభయం పాపం ...!
మామనవడు నివిన్ మాత్రం 
మిగతా పిల్లలకు బిన్నం ....
ఎప్పుడో ఒకసారి మావాడికి 
దీనితో అనుభవం అయింది ,
అంతే --
ఇప్పుడు ప్రతిరోజూ 
స్నానం అయిపోగానే 
జిందా వాసన చూపించడం 
రివాజు అయింది ...!
లేకుంటే ---
ఆరున్నొక్క రాగానికి 
ఆహుతికావలసిందే మరి !
అదే మరి మనవడి ప్రత్యేకత !!
                    ***
కామెంట్‌లు