మనసు పొరలు తొలిగించి
లోపలి లోతుల్లోకి తొంగి చూస్తే
దోసిలి నిండా దొరికే
మకరందపు ఊట స్నేహమంటే!
మన మంచి మన కంటే
ఎక్కువ కోరుకుంటూ
మనమెపుడూ బావుండాలని
మొక్కుకునేది స్నేహమంటే!
చేతిలో చేయి వేసి నొక్కి
ఏం కాదు భయపడకని
మనసుకెంతో ధైర్యమిచ్చేది
నిజమైన స్నేహమంటే!
ఎదురైన ఆపదకు
ఏమీ తోచక బెంబేలు పడి
ఒంటరైన క్షణాలలొ
నేనున్నా నీకంటూ వచ్చేది
స్నేహమంటే!
తలచుకున్నా కలుసుకున్నా
తాకినా.... పలకరించినా
మనసంతా పరచుకునే
మధురమైన పరిమళమే
స్నేహమంటే!
లోకానికి మిత్రుడై
జగానికి ఆప్తుడై
సృష్టికి ఆదిదైవమై
కనిపెట్టుకుని కాచి రక్షించే
కర్మసాక్షిని స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి