స్నేహం విలువ ;-: బయ్య శ్రావ్య-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది,ఆ అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు మరియు కాకి ఉండేవి, ఒకరోజు వేటగాడు అడవికి వచ్చి, కోడి పుంజును చూసాడు, తెలివిగా కోడి పుంజును పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తుంటాడు, ఇదంతా చెట్టు మీద నుంచి గమనించిన కాకి, కోడి పుంజును ఎలాగైన కాపాడాలి అనుకుంటాడు, వేటగాడు వెళ్లే దారిలో కాకి చనిపోయినట్లు నటిస్తూ ఉంటుంది, కాకిని చూసినా వేటగాడు సంచిని పక్కన పెట్టి, కాకిని పట్టుకోవడానికి వెళ్తాడు, ఇంతలో కోడిపుంజు తప్పించుకోవాలని తహతహలాడుతూ,సంచి నుంచి పాపారిపోతుంది, అలా కాకి వేటగాడిని మోసం చేసి, కోడి పుంజును కాపాడుతుంది.

 ఈ కథలోని నీతి :ఎప్పుడైనా ఆపదలో ఉన్నా స్నేహితులను ఆదుకోవాలి

కామెంట్‌లు