ఇంకెప్పుడు...అది ఎన్నడు ? : కోరాడ నరసింహా రావు !
వాదము లవి యేవి యైన 
ముదమును గూర్చ గలవా..!? 
 ఖేదము దప్ప...!! 

మతము లవి యేవి యైన 
 హితమునుచేకూర్చగలవా..!? 
  మానవత్వము దప్ప ..!! 

ఓ మనిషీ...! 
  ఈ అనంత విశ్వమునకునూ
    కేంద్ర బిందువు నీవే...! 

సృష్టి రహస్యము నెరిగిన
  ఘనుడవు నీవే...! 
    వ్యక్తివి కావు.... 
    అనంత శ క్తి వి  నీవు !! 

ద్రష్ఠవు నీవు ...స్రష్ఠవు నీవు
 విశ్వా మిత్రుడ వీవు... 
   శత్రువు కావు..! 

పంచ భూతముల శక్తి తో
  ఆవిర్భవించిన.... 
   సష్టమ భూతము వీవు..!!

ఈ భువిని 
  దివి గా మార్చిన
     బ్రహ్మ వు నీవు...! 

విశ్వ మంతా వ్యాపించిన
   నారాయణు డవునీవే
  ప్రలయాలను సృ ష్ఠిం చే
    విలయము నీవే...!! 

ఈ ప్రపంచమునకు... 
  పెద్దసమస్యవూ నీవే....! 
  సమాధానమును నీవే..!! 

బాహ్యముతో .... 
  విబేధములు ఇంకెన్నాళ్లు
  అంతర్ముఖుడవై  నీవు
    ఆలోచించే దెన్నడు...?! 

నిన్ను నీవు 
    తెలుసుకునే దింకెప్పుడు? 
నీ నిజ తత్వ ప్రదర్శనము   
  ఇంకెన్నడు...?! 
     ********

కామెంట్‌లు