న్యాయములు -711
శ్వాన మార్జాల న్యాయము
******
శ్వ అనగా కుక్క, శునకం. మార్జాల అనగా పిల్లి,బిడాలం,కస్తూరి మృగము అనే అర్థాలు ఉన్నాయి.
శ్వాన మార్జాలంలో శ్వాన అంటే కుక్క. మార్జాలం అంటే పిల్లి.ఇందులో కుక్క ఆకారంలో పెద్దది.పిల్లి చిన్నది కాబట్టి ఆ రెండింటి పోట్లాటలో గెలుపు కుక్కదే అవుతుంది.
ఇలా కుక్క మరియు పిల్లిని గురించి అనుకోగానే పిల్లలకు, పెద్దలకు ఇష్టమైన "టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో కళ్ళలో మెదులుతుంది.
కుక్కకు మరియు పిల్లికి అనాదిగా పాము ముంగిస వలెనే జాతి వైరం ఉంది.పిల్లిని చూస్తే కుక్కకు వేటాడాలనే కోరిక కలుగుతుంది.కుక్కని చూస్తే పిల్లి ప్రాణభయంతో పోరాటానికి సిద్ధం అవుతుంది.నిత్యజీవితంలో తరచుగా ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూస్తుంటాం.
అయితే శ్రీకాకుళాంధ్ర శతకంలో కవి గారు " అన్నట్లు ఈ సృష్టిలో ప్రతి జీవికి మరొక జీవిని ఆహారంగా చేశాడా సృష్టి కర్త" అనిపిస్తుంది.
ఇక విషయానికి వద్దాం.ప్రకృతిలోని చాలా జంతువులు ఒకదానికి మరొకటి ఆహారం అవ్వడం మూలానా అవి స్నేహంగా వుండవు. అలా కేటాయించిన జంతువు తమ కంటబడగానే లేదా ఎప్పుడైతే వాటి ఆహారంగా కనిపిస్తుందో వెంటనే శత్రు జంతువుకు నోరూరుతుంది.చంపి తినాలనే కోరిక కలుగుతుంది.ఆ విధంగా వాటిల్లో వేటాడే హింసా ప్రవృత్తి పొడసూపుతుంది.
మరి దీనిని పెద్దవాళ్ళు మానవులకు అన్వయించి ఉదాహరణగా చెప్పడానికి గల కారణం చూద్దాం.కొంత మంది భార్యాభర్తలు టామ్ అండ్ జెర్రీ లో వలె నిత్యం పోట్లాడు వుంటూనే ఉంటారు.
అయితే వారిద్దరిలో మానసికంగా బలమైన వారు శునకంలా,బలహీనమైన వారు పిల్లిలా ఉంటారని అంటుంటారు.
అందుకే హిందూ మతంలో కొంత మందికి కొన్ని నమ్మకాలు ఉన్నాయి.ఎందుకంటే వివాహ సమయంలో ఇద్దరి జన్మ నక్షత్రాలు - వాటి తాలూకు జంతువులను చూసి వాళ్ళ భవిష్యత్తు ఇలా వుంటుందని చెబుతుంటారు.
అయితే వాళ్ళ జీవితం అంతా పోట్లాటలు లేకుండా ఉండాలంటే పూర్వం మన మహర్షుల ఆశ్రమంలో కలిసి మెలిసి జీవించిన భిన్న జాతుల జంతువుల గురించి చెప్పుకోవాలి.
శకుంతలా దుష్యంతుల కుమారుడైన భరతుడు కణ్వమహర్షి ఆశ్రమంలో కౄర మృగాలతో ఆడుకునే వాడని చదువుకున్నాం.జాతి వైరం మరిచి పరస్పరం స్నేహంగా ఉండేవట.అలాగే అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంలో కూడా కౄరమైన సర్పాలు వాటి శత్రువులైన నెమళ్ళతో కలిసి ఉండటం.రమణ మహర్షి మాటలు విని తలవంచుకుని పోవడం చాలా మంది చూశారని అంటుంటారు.
ఆ అట అనడాలు నేడు మనం కూడా వదిలేయొచ్చు.ఎందుకంటే చాలా మంది నేడు తమ ఇళ్ళలో కుక్కని, పిల్లిని పెంచుకోవడం వల్ల అవి జాతి వైరం మానేసి అన్యోన్యంగా ఉండటం మనం చూస్తున్నాం.కాబట్టి జాతి వైరాన్ని మాని "శ్వాన మార్జాల న్యాయము"ను తారుమారు చేద్దాం. ఎలాంటి భేద భావాలు, ఎక్కువ,తక్కువలంటూ లేకుండా కలిసి మెలిసి జీవిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి