న్యాయములు -715
శ్రామ్యే త్ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన న్యాయము
****
శ్రామ్య అనగా శాంతిని బొంది, మనస్సును ఏకాగ్ర పరచి, తత్ అనగా అది.ప్రత్యపకార అనగా తిరిగి అపకారం.ఉపకారం అనగా మేలు,మంచి చేయుట,హాని చేయకుండా ఉండుట.దుర్జన అనగా దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డ వాడు అనే అర్థములు ఉన్నాయి.
దుర్మార్గుడు ప్రత్యపకారం చేతనే లొంగును కానీ ఉపకారము చేత లొంగడు అని అర్థము.
ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని రామాయణములోనే ఉంది.దాన్ని చూద్దామా.
రాముడిని పెండ్లి చేసుకోవాలంటే సీతమ్మ అడ్డుగా వుందని శూర్పణఖ సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో శూర్పణఖ ముక్కు చెవులు కోసి విరూపిని చేయమని చెబుతాడు.అలా విరూపి అయిన శూర్పణఖ రావణుని మనసు మారేలా చేస్తుంది.రావణుడు సీతను అపహరించడానికి మారీచుని సహాయం కోరుతాడు.దానికి మారీచుడు రాముని శక్తిసామర్థ్యాల గురించి చెప్పి అనవసరంగా రామునితో కయ్యానికి కాలు దువ్వవద్దని చెబుతాడు. కానీ రావణుడు తనకు సహకరించకపోతే తనచేతిలో మరణించక తప్పదని బెదిరిస్తాడు.మంచి చెబితే వినకుండా తననే చంపేందుకు సిద్ధ పడ్డ రావణాసురుడి గురించి అపకారికి అపకారమే చేయాలని తలంచి బంగారు లేడిగా మారి సీతమ్మ వారి అపహరణకు కారకుడు అవుతాడు.
ఆ విధంగా తాను మరణించడం తథ్యమని తెలిసి అపకారి అయిన రావణుడు కూడా మరణించేలా చేస్తాడు మారీచుడు.
అలాగే శాంతి పర్వములో భీష్ముడు ధర్మరాజుకు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెబుతాడు. శత్రు రాజుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారిని ఎప్పుడూ కూడా క్షమించి వదిలివేయకుండా కనిపెడుతూ ఉండాలని చెబుతాడు..
పాముకు పాలు పోసి పెంచినా అది కీడే చేస్తుంది.అది అపకారికి ప్రతీక.కాబట్టి మనం పాముని చూడగానే చంపేస్తాం.లేదా తరిమి కొడతాం.
అలాగే కొంతమంది కౄరులు భయంకరమైన దుష్టత్వంతో ఎన్నో తప్పిదాలు చేస్తారు. వారిని వదిలేస్తే జరిగేది కీడే కానీ మేలు కాదు.కాబట్టి అలాంటి వారికి తగిన శిక్షలు వేసి శిక్షించాలి.
రైతు- పాము కథ అందరికీ తెలిసిందే.అయినా మరోసారి చెప్పుకుందాం. రైతు పొలం చుట్టూ వేసిన కంచెలో ఓ పాము చిక్కుకుని వుండటం చూస్తాడు. పాపం రక్షిద్దాం అని ఓ కర్రతో దానిని బయటకు లాగాడు.అది బయటికి వచ్చి రక్షించిన రైతునే కాటేసి పోతుంది.
అలాగే ఓ సాధువు తాను యేటిలో స్నానం చేస్తూ ఉన్నపుడు ఓ తేలు కొట్టుకుంటూ పోవడం చూసి కాపాడుతాడు.దానిని అలా నీటి నుండి తీయగానే కుట్టబోతుంది. అలా చేయడం తప్పు అని ఆ తేలుకు చెబితే కుట్టడం తన సహజ గుణము అంటుంది. మరలాంటి అపకారికి సాయం చేయవద్దు అని నిర్ణయించుకుని దానిని యేటిలో వదిలేస్తాడు.
ఇలా దుష్టులకు తగిన శాస్తి చేస్తేనే, శిక్ష వేస్తేనే మరోసారి ఇతరుల జోలికి రారు.అనే అర్థం ఈ "శ్రామ్యే త్ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన న్యాయము"లో ఇమిడి ఉంది. కాబట్టి ఇందులో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే సహనానికి ప్రతి రూపంలా భరిస్తూ ఉండొద్దు.అపకారికి తగిన శాస్తి, బుద్ధి చెబితేనే మరోసారి అలాంటి ఆలోచనలు వారిలో రాకుండా ఉంటాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి