అందమైన కలలు తెచ్చేదే కాదు
బరువైన కలతలు కురిపించే
కన్నీళ్లు తెచ్చేది కూడా రాత్రే!
పరుగులు పెట్టి అలసిన
మనసుకు విశ్రాంతి నిచ్చేదే కాదు
ఆలోచనకు అవకాశమిచ్చేది
తప్పొప్పులు తర్కించుకునేది రాత్రి
ఆలోచనలు కొలిక్కి వచ్చాక
అన్నీ నిదురలో మరచే
అంతరంగం సేద దీరాక
ఆత్రంగా చూసేది వేకువ కోసం!
గగన దీపంలా దర్శనమిచ్చి
జగమంతా వెలుగు నింపి
బ్రతుకులు వెలిగించుకునే
అవకాశం ఇచ్చే దైవం....
సాగరమంటి సంసారంలో
ప్రాప్తమున్న తీరానికి
జీవన నౌకను నడిపించి
అద్దరిని చేర్చే దైవం...
మనకు కూడా తెలియని
మన గురించిన వివరాలన్ని
తనలో ఉంచుకుని అందుకు
తగినట్టే ఫలాలు మనకిచ్చే కర్మసాక్షి
అందరికోసం అందించే
ఆనందాల కోసం చూస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి