కొవిడ్ తర్వాత చిన్న వయసువారు సైతం గుండెపోటుకు గురవడం, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతినడం.. వైద్యశాస్త్ర వర్గాలను సైతం కలవర పెడుతున్నాయి. అవయవాల మార్పిడి అవసరం రానురానూ పెరుగుతోంది. ఆధునిక వైద్యశాస్త్ర పరిజ్ఞానం వల్ల అవయవ మార్పిడి సులభతరం అవడం శుభ పరిణామం.శంలో అవయవ మార్పిడి చేసే వైద్యనిపుణులు పెరిగారు. ఆసుపత్రులు పెరిగాయి. మార్పిడికి అవసరమైన అవయవాల లభ్యత మాత్రం పెరగలేదు.వయవాల అమరికకై ఎదురు చూస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉండగా, దాతలు వేలల్లోనే ఉన్నారు. దానితో సింహభాగం రోగులు ఈ లోకం నుండి నిష్క్రమిస్తున్నారు.వివిధ ప్రమాదాల్లో చనిపోతున్నవారి నుంచి, బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించే అవయవాలు అనేక ప్రాణాలను నిలుపగలవు. కానీ, కుల, మత పరమైన నమ్మకాలు, విశ్వాసాలు అవయవదానానికి అడ్డుగా మారుతున్నాయి. అవయవదానం ద్వారా చనిపోయినా జీవించవచ్చనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటుకునేలా చేయాల్సిన అవసరం చాలా ఉంది.అవయవ దానం ద్వారా కొత్త జీవితం లభిస్తుంది.అవయవ దానం అవశ్యకత ను అందరం గుర్తించేలా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున ఉపక్రమించాలి. అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అవగాహనాలోపం, అపోహలు అవయవదానానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా అందరి కోసం అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగష్టు 13 న జరుపుకుంటారు. సమాజంలో అవయవ దానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర ఆరోగ్య సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సంబంధిత అంశాలపై ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తాయి.సజీవ దానం మరియు శవ దానం అనేవి రెండు రకాల అవయవ దానం. సజీవ విరాళంలో, దాత ఇప్పటికీ జీవించి ఉంటాడు, అయితే, శవ విరాళంలో, దాత మరణం తర్వాత సహకరిస్తాడు. సజీవ దాతలు అవయవ దాతలు, వారు మూత్రపిండాలు మరియు కాలేయ భాగాలు వంటి అవయవాలను ఇవ్వగలరు. మానవులు ఒకే ఒక మూత్రపిండముతో జీవించగలరు మరియు పునరుత్పత్తికి తెలిసిన శరీరంలోని ఏకైక అవయవం కాలేయం, దాత సజీవంగా ఉన్నప్పుడే ఈ అవయవాలను మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తుంది.
అవయవదానం ప్రాముఖ్యత: -సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి