చెట్టును పుట్టించింది - భూమి
చెట్టుకు సహాయం చేసిన వాడు
సూర్యుడు!!
చెట్టును సాకినవాడు
వ్యవసాయం చేసిన వాడు- రైతు!!?
చెట్టు పలానిస్తుంది
ప్రతిఫలం ఆశించదు!!?
చెట్టులాఫలమిచ్చి
ప్రతిఫలం ఆశించని వాడు రైతు!!!
పొలం పంట నిస్తుంది
కాసులను ఆశించదు
రైతు రాశులను ఇస్తాడు
కడుపు నింపుతాడు.
ఆశ లేనివాడు రైతు ఒక్కడే!!
పచ్చని మొక్క
ఆకుపచ్చని పాలిస్తుంది!
రైతు చెమట చుక్క
ఎర్రని రక్తం తయారు చేస్తుంది.!!
పూలు పలాలు కాయలు
భూమిపై పూసే పగటి చుక్కలు
చెట్లే భూమిపై మెరిసే నక్షత్రాలు!!
రైతులే రాజ్యాన్నేలే సూర్యచంద్రులు!!?
గనులు తవ్వకుండానే
బంగారం పండించేవాడు రైతు!!
భూమి గుణాల గనుల్లో
వనాలను సృష్టించేవాడు రైతు!!
తలలు తీసేవాడు కాదు
చెట్టుకు తలకాయలై కాసేవాడు రైతు
తల్లి కడుపులో కాయై కాసేవాడు రైతు
ధనాన్ని సృష్టించేవాడు కాదు
జనాన్ని సృష్టించేవాడు రైతు!!!!!?
నేడు జాతీయ రైతు దినోత్సవం.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి