చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల*

వృద్దులైనను గాని సైకిలు పైన సాగిరి గమ్యముల్
పద్దతై పనులందు తాతల బాట తండ్రులు సాగుదుర్
పొద్దుగూకిన రాక పొలము పొందు వెన్నెల ముచ్చటల్
సద్ది తిన్నది మేలు రాత్రుల సాము మోటల సందడిన్

*కందం*

తక్కువ సమయమునందున
మిక్కిలి గమ్యమును చేర మీసము తిప్పిన్
సైకిలు పైడీలుతొక్కి
సక్కగ పరుగెత్తి తాత సాగేన్ తోవల్
కామెంట్‌లు