చిత్ర స్పందన : ఉండ్రాల రాజేశం
 *మత్తకోకిల*

పుస్తకంబులు చేతులున్నను బోధనందున విద్యలై
మస్తకంబున చేరియుండిన మంచి మార్గము నెప్పుడున్
హస్త భూషణమైన పొత్తము హంగులన్నియు పంచియున్
విస్తరించును మాతృభాషన వేద శాఖల సౌరభమ్


*కందం*

అక్షరముల గుంపులన్ని
లక్షణముగ కూర్చి చదవి రక్షణమనగన్
వీక్షణము సిరా చుక్కా
లక్షల మెదడ్ల ప్రగతిన రంజిల్లునిలన్ 
కామెంట్‌లు