మెరుపులు కురిపించిన వీక్షణం 149 వ అంతర్జాల సమావేశం
 =కాలిఫోర్నియా అంతర్జాల వీక్షణంశనివారం  మూడు గంటలు జరిగిన  సమావేశంలో మొదట ముఖ్య అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి తన ప్రసంగంలోను   28 మంది కవులు తమ కవితలలోను చమక్కులవాన కురిపించారు. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారు ఆలపాటి గారిని పరిచయం చేసి వారు సమావేశంలో పాల్గొనటం మన అదృష్టం అనిచెప్పారు. ఆలపాటి గారు కదిలించేకవిత్వం కావాలి, ఆశ్చర్యం కలిగించే కవిత్వం కావాలి, ఉత్సాహపరిచే కవిత్వం కావాలి, పలకకవిత్వం కాకుండా పలుకరించే కవిత్వం కావాలని చెప్పారు. కవులు ఆది, వెంకట్, ప్రసాదరావు, ఘంటా మనోహరరరెడ్డి, తేళ్ళ అరుణ, అయ్యల సోమయాజులప్రసాద్, రామక్రిష్ణ చంద్రమౌళి, ఆలపాటి గారి ప్రసంగం కవుల మనసుల్లో చమక్కులు నాటాయని కొనియాడారు.
తర్వాత వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవిసమ్మేళనం నిర్వహించారు. డాక్టర్ గీతా మాధవి అచ్యుతం కేశవం అనే శ్లోకమును, పండుగంటే అనే కవితను  వినిపించారు. ఆలాపాటి కవి శాంతము కోరుకునే మనసు అంటు 6 భాషలలో కవితను ఆలపించారు. యువ కవి ఆది ఏమి దెబ్బ అనే హాస్య కవితను, కొత్తూర్ వెంకట్ కంద చంపకమాల ఆట వెలది పద్యాలను మూడుటిని వినిపించారు. భవాని సంక్రాంతిలక్ష్మి అనే పాటను, ఘంటా మనోహరరెడ్డి గతం చేసిన గాయాల ఙ్ఞాపకాలు ఎందుకు  అని, నరసం అధ్యక్షురాలు తేళ్ళ అరుణ అతడు ఆమె కవితను, యువ కవయిత్రి బీరం అరుణ ఆకాంక్ష  కైతను, అయ్యల సోమయాజుల ప్రసాద్ బొమ్మలకొలువు కవితను, గౌరీపతి శాస్త్రి మధ్య తరగతి జీవితాలు అనే కవితను వినిపించారు.చంద్రకళ దీకొండ చిరునవ్వులు చెరగనీయకుమా అని, రామక్రిష్ణ చంద్రమౌళి తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సైన్ మీద నో నెవర్ అనే కవితను, డాక్టర్ మోటూరి నారాయణ మరో పొద్దుపొడుపు అనే కవితను,  డాక్టర్ దేవులపల్లి పద్మజ ప్రేమ భ్రమ అనే కవితను, మేడిసెట్టి యోగేశ్వరరావు మా అమ్మాయికి పెళ్ళయింది అనే కవితను, పరాంకుశం క్రిష్ణవేణి హృదయ గవాక్షం అనే కవితను, అమీనా కలందర్ ఎక్కడికో ఈపరుగు అని, బుక్కపట్నం రమాదేవి ఎదలోయల్లో ఇంద్రధనస్సు అని, డాక్టర్ కోదాటి అరుణ నవ్వు పైన, డాక్టర్ బృందా ప్రాణాధారం అనే కవితను, సుజాత కోకిల నా పిల్లలే నా ఆధారం అనే కైతను, చిట్టాబత్తిన వీరరాఘవులు నిప్పుకణికలు అనే సూక్ష్మకవితను వినిపించారు. వావిలాల మంజుల గారు చూపులు దిక్కాంతరాలు వెదికాయి అని, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి తెలుగు వారి గుండె చప్పుడు ఎన్ టీ ఆర్ అనే కవితను, పరిమి వెంకట సత్యమూర్తి నటసార్వభౌమ ఎన్ టీ ఆర్ అని, ఉప్పలపాటి వెంకట రత్నం ఆత్మార్పణం అనే కవితను వినిపించారు. చివరగా కవిసమ్మేళనం నిర్వాహకుడు గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ చమక్కులు చురుక్కులు అనే కవితను వినిపించి చమక్కు లేని కవితను చప్పననవలె, వ్యర్ధమనవలె, రసహీనమనవలె, తెలివితక్కువనవలె వివేకవంతులారా అని పాడి కవిసమ్మేళనమును ముగించారు. గీతా మాధవి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
                             వీక్షణం గవాక్షం

కామెంట్‌లు