ఎగిరే పతంగి నింగి తాకినా తెగని దారం ఊరు
ధైర్యం సందిట నేల గెలిచి నిలిచే చెట్టు పల్లె
అనురాగ తరంగాల నది గట్టు గుట్టు ఊరు
పసుల మూగ మమతలు పెంచే కంటిరెప్ప ఊరు
అతిథి రాక ఆనందమైన బంధాల ఏరు ఊరు
మూగ కాదు ఆముక్తమాల్యద తలపు ఊరు
రక్తమైన పరుగు మనసులో నుడుగు తడల ఊరు
విశ్వాస ఆశ్వాస పొత్తమే గాలి నీరు మట్టి ఊరు
వినయశీలత పాదుల సూర్యకాంతి పొదుగు పల్లె
ఆనల ఈనెలు సానదేరిన సోన మనిషి ఊరు
భావోద్వేగాల వాకిట రాసిన నోటిపాట మన ఊరు
మనసు రణగొణల దూరమైన ఊరు శాంతివని
ఆకుకొమ్మల మారాకు పల్లె చింత లేని మట్టి
గొల్లభామ సత్యభామ సయ్యాట కోట ఊరు
వెన్నతేనెల బిగిముడి కలిసి కాచే వని ఊరు
ఆశ నిండిన చెరువు ఊరు ఆకుపచ్చ తరువు
ఉప్పునీరూ పప్పుకూడు లేని దండ ఊరు
మంచిచెడుల పరుగు మనిషి అరుగు ఊరు
ఆదమరిచిన నిద్ర కడుపుచల్ల చల్లని ఊరు
మనిషి అండ మనసునిండా తీపి బతుకు ఊరు
=================================
(ఇంకా ఉంది)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి