పండుగల సందడి ఊరు చిరునామా పల్లెపరుగు
కొత్త ఉత్కంఠ ప్రతి ఇంట ఎగిరేసే ఆనందం ఊరు
రాకపోకల యాత్రలో నేల ఆలింగనం ఊరుహేల
ఆశల తీపి బూరెల బుగ్గలు మెరిసి నోరూరె పల్లె
కోరిక కోరే గారెలు కారం గాలిబుగ్గల మిసిమిమట్టే
కొత్త నోముల జంట గిలిగిలి గుసగుస ఊరుగుండె
అమ్మ వాసనవంట తీర్చని ఆకలి తినే పల్లె బొజ్జే
చెలిచేతి గలగల గాజుల పాట దోచే మది ఊరే
ఆడమగ ఆత్మీయ సంగతులు మిన్నంటె ఎద పల్లె
అనురాగాల మనసు ప్రేమరుచి తిని భ్రేవనే ఊరు
భామభాషల తేలెతేమ ఊరు ఊక కాని ప్రేమవాక
పిండివంటల నింగితాకే జవ్వన చేతి పాకం ఊరే
ఆకుల భోజనం అరచేత నేతి మూతిఊట ఊరు
హుషారైన జోకుల కేకులు పేలే పల్లె బాంబులు
షిప్పుల రిలేషన్స్ ఫ్రెండ్స్ వొడిచిపట్టే ఊరే బతుకు
భావోద్వేగాల కవుల కల్పనల లయే ఊరుకవిత
పనీపాటల ఆడికూడే నాట్యాలే పల్లెనేల స్వాగతం
మీనమేషం వర్జ్య దుర్ముహూర్తం గడపల పల్లే
ఊటీ లంబసింగి కౌతాల నయాగర కాశ్మీర చలి
కాశీ ప్రయాగ బృందావని శీతశైల కన్నె వన్నె కన్ను
అపూరూప అపరంజి సంజె కెంపుల పల్లే పల్లె ఇల
=====================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి