ఊరుగాలి ఈల 53:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అలుకుజల్లిన ఊరే రంగుముగ్గుల గొబ్బెమ్మ
పాటల హరిదాసులు భక్తిని అర్ధించే ధన దానం
అభిమానంతో సంక్రాంతి వేడిపుట్ట భోగి మంటలు

పసులపూజ ఎద్దుగోవుల దర్జా ఆడిపాడే పండుగ
రైతురాజు కృషిశాల ధాన్యరాశులపంట పట్ట మేడి
ఆపలేనీ వోపలేని ఝరుల హేల సంగీత సంక్రాంతి

మనసు గుండెల ఊగే ఊరు సకినాల సొగసు 
తీర్థాల ఆనంద గంధం పలికే పల్లే సుందర సీమై
అమ్మ పులకించె అవని పలవరింత కథ ఊరుదే

దీవించ తలంబ్రాల రేగుపండ్లు పిల్లల భవితకై
చీకటిపై పోరు నరకవధనే సత్య సల్ప నవ్వె క్రాంతి
ధనధాన్య బతుకున పొలం హలం ఊరే సంక్రాంతి

సుఖసంతోషాల నవ్వు విరిసే జీవమే పల్లె సీమ
మఖ్మల్ ముఖమే ఛాయ సంబరం సంక్రాంతి
పండుగల వేళ మాటలేల చిత్తమే మనకు ఊరు

కులమతం కమతాలకే లేదు నీకొద్దు పైరుపల్లె
కలలు మజా రాజకీయ మజిలీల దంత నవ్వు
చిరునామ నాదని చిగురించె మొక్క నాఊరు 

పలుకు తీపి పలుక కోపి బడివొడి తడిసే ఊరంత
సొంతమట్టి సొంత పల్లె ముల్లు గుచ్చని జనదక్ష
మాట మువ్వ పాటనవ్వు సొదల పర్వం ఊరు
============================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు