గాలి అలల గలగల చెలి ఎగిరేసే కురుల అందాలు
పాలునీరు వేరుచేయు కళల హంసల సోయగాలు
చంపక దరహాస తెమ్మెర పరిమళ పల్లె ప్రభలు
పల్లె నిలువెల్ల కనులు చెవులు బతుకు ఆశ
నలుదిక్కుల కదిలే పనులు చేతివృత్తుల ఊరు
ధనం చుట్టూ ధరణి పనికి మనిషి ఊరంతా
పండుగలు సంస్కృతి భాష నాగరికత మనఊరు
చెట్టులో జీవుడున్న జీవం జీవి నవ్వేదే పల్లెసీమ
ధర పలుకని వస్తువు పనికిరాని ఊరు తెగిన ఏరు
ఆశల చిరునామా ఆకు మనిషి నమ్మిక ఊరువాడ
గొప్పలొద్దని తిప్పలొద్దనే ఊరు ఉన్నదే తాగే నీతి
ఊరంటే మహా వృక్షనీడ చదువని ఊరే ఎద బడి
పరులమేలు ఎంచి నరుని స్నేహించు లయ పల్లేదే
లాభాల విపణిలో పొరుగు నీడ మనిషి ఊరది
లోపలి మనిషి అల్లే లోకవితల నడక ఊరుజీవం
ఉనికి తునికి పండు పూల దండు నేల ఊరుపేరు
ఆమెడల దూరాలు నడిచే కీళ్ళు కాళ్ళదే ఊరు
ఇసుక తిన్నెల సంద్రం వెన్నెల నది ఆడేదే ఊరు
రేశమెక్కువ అభిమానమే మెండు మది పల్లెపాట
తలవంచని ధైర్యమే కొండంత ప్రేమ ఊరంత
మనసు శాంతం మనిషి ఓపిక బాటే ఊరంతా
=================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి