ఊరుగాలి ఈల 58:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
చదువు అందించిన బడినుడి మనిలోన ఊరు
బాధ్యతల టీచర్ డాక్టర్ కవిగ వైవిధ్యం పల్లెనేల
ప్రతిభ వికాస ప్రభావశీలి కష్టజీవి సృజన ఊరు

ఊహకందని చెమట భాష్యం భావకవితే ఊరు
కొండమీద కోతి నేలపై మనిషైన మనసు పల్లె
గుడిసె గడ్డికప్పు నింగికప్పు ఇల్లు మేధ పల్లె

గడి బతుకు బడి మెతుకు చేదుతీపి రుచి ఊరు
పలక బలపం నల్లబల్ల సుద్దముక్క విద్యల  ఊరు
పెన్ను పేపర్ కంప్యూటర్ లాప్టాప్ నేర్పే పల్లెసీమ

మౌఖికం తాళపత్రాల నుండి డిజిటల్ బుక్ చదివే
ఉత్తరాల ప్రేమలు వార్తలేవి!ఫోన్ సెల్ కథ గాడ్జెట్స్
రేడియో మర్ఫీ ఫిలిప్స్ పాటే సీరియల్స్ టివీపల్లేలే

సిలోన్ వివిధ భారతి బినాకా సినీపాటే  చిత్రప్రేమ
ఎంతమారే మనిషి ఎలామారునో మారంది ఊరే
తాతా మనుమడు చరిత్ర ఊరదే మనిషే వేరుగా

పండుగ సంస్కృతి అదే పల్లెమాటే వేసే కొత్త వేషం
గిరిజన గీతాలు కోయ నాట్యాల నదులు సాగేఎద
సూటూబూటూ కోటు వచ్చే ఆత్మ మారని పంచెల

అమ్మ కొమ్మ ఊరూవాడా పంచిన ప్రేమ అమృతం
సుఖదుఃఖాల తీపిచేదుల సాగర మధనం ఊరు
పైరు పచ్చల హారం వంకసిగలో మల్లె ఊరు స్నిగ్ధ

=================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు