ఆశకు హద్దు దురాశకు సుద్దు ఊరు కనికట్టు
పొదుపు అదుపు మాటతీపి మదుపు పల్లెసీమ
కట్టెలపొయ్యి వంట సకినాలు ఆటకట్టు చలిఇంట
ఊరు మూగదికాదు మాట్లాడే మౌనం జోరుహోరు
రక్తమాంసం మనిషి మోసంలేని గాలి ఊరు
పుట్టతేనె రుచి కోడిపెట్ట కూత లేచే పొద్దు లేతసెగ
కన్నీరు పన్నీరు కలిసి ఊరేగే మనిషి గుండే ఊరు
పాటల తోట ఆటాడే నెలబాల పోరే ఊపిరి ఊరు
తనువూ మనసూ ఆటాపాట జాతరే నేల పల్లెరా
ఆరని దాహం తీరని నేల మధు కలశం ఊరురా
ఆమని వేళ ఏమని పిలువ రాననుటే సిరి ఊరు
ఆరాధనల మధుభాషణే మనిషి సిగసిరి చేరుపల్లె
మదనుడు చెలరేగని రాగిని క్రీడ నిర్మల ప్రేమజోత
శిలల ప్రాణాల శిల్పదీపాలు మనిషి బతుకే ఊరు
కలకాని బతుకు వరమే మనిషి తెగువ ఊరే ఇల
ముక్కుపుడక నాగరం సిగపూల వెలుగు నగే పల్లె
అందమే ఒడ్డాణం నడుము వొంపే ఊరు సడినుడి
మేఘాల తేలే జాబిలి కురులు విరివాన పల్లెమట్టి
ఆరాటపోరాట బతుకు నేర్పే ఊరుచేను సొక్కం
పసుపు పచ్చ ఆకుపచ్చ రంగుల ప్రకృతినేల పల్లె
ఉల్లాసం బ్రహ్మానందాల బతికే ఊరు ధూంధాం
====================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి