లేగలఆవులు పసుల సోపతి తీపి బంధమై ఊరు
మనసుతో మనసుమాటే ఈల మనిషే ఊరు నది
కొత్తపాత లేదు మనిషి బోళా ఊరు కథాకళి భళా!
మమత వీడే మనసు కాల్లే రాకాసి పని పట్ట ఊరు
మంచి మాట పెడ చెవినిపడ్డ కాలమే చెడె పల్లెల
పల్లెగాలి మనిషి నీడ గాయపడే దుశ్శకునం రఫ్
గాలిపటమే ఎగురు దారం దండ పూల గుచ్చే పల్లే
తేనెవాసన సుమపరిమళమే విచ్చే ఎద ఊరుగా
పెద్ద బాడిశె వడ్లచేత రాతెండి కంచం కంచరిపోతే
గాలిసోకే పిల్లపాపల కూలిదొరకని రోజులా ఊరు
మూస బతుకు మారిపోదా మనిషి ఆశ నింగి చేర
అందలం ఎక్కినా మరువలేని చక్కనైన తల్లి ఊరే
ఈడేరే చదువులిచ్చే బతుకుబాట నౌకరివిరి పల్లె
ఊరువాసన లోకమే నడకమారిన వేరు మనిషి
తెలుగుతీపి పంచేలే జగం మురియ తల్లీ దండం
భారతావని తెలంగాణగాలి కాకతీయ చెరువుపల్లే
పాలకుర్తి బమ్మెర కైతలే వీచేగాలి సోమన పోతన
దైవమే నడయాడే అక్షరవాకిట ఘంటమే చేగొని
మహాభాగవతం భక్తి, బసవుని శక్తి మసైన నేల
అర్చన అంజలి అక్షరదీక్ష ఊరంత జానుఁతెనుగు
ఆవహం ఔపోసన మేళవింపు ఇంపు పల్లెమాట
-------------------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి