మా ఊరి దగ్గర నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో అనంతసాగర్ అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో సరస్వతీదేవి దేవాలయం ఉంది ఇది అత్యంత ప్రసిద్ధి గాంచింది ఇక్కడ సరస్వతీ దేవి నిలిచి ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జాతర జరుగుతుంది ఈ జాతరకు సరస్వతీ దేవిని ఇలవేల్పుగా కొలిచే కొన్ని వేలమంది భక్తులు వచ్చి ఉన్న వారిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయానికి వెళ్లే దారిలో ఆకట్టుకునే రంగురంగుల కమాన్ మనకు స్వాగతం పలుకుతుంది జనవరి ఒకటవ తేదీన ఈ ఆలయానికి భక్తులు విశేషంగా వస్తారు ఫిబ్రవరి నెలలో రెండు మూడు నాలుగవ తేదీలలో ఇక్కడ జాతర జరుగుతుంది ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు ఇక్కడ మూడు దోనెలు ఉంటాయి మొదటి దోనె రాగి దోనె రెండవ దోనె పాల దోనె ,మూడవ దోనె చీకటిదోనె ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దోనెలలోని నీటిని తలపైన చల్లుకుంటారు. ఈ ఆలయంలోని సరస్వతీ మాతను దర్శించుకుని తమకు విద్యాబుద్ధులు ప్రసాదించమని వేడుకుంటారు
అనంత సాగరేశ్వరి;- యు.వినయ్ కుమార్-7 వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -రేగులపల్లి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి