మనిషికి ఓర్పుతో పాటు పట్టుదల ఉండాలి.అప్పుడే విజేత గా నిలుస్తాడు. బెర్నార్డ్ పాల్సీ అనే వ్యక్తి చైనా ఎనామిల్ తయారుచేసి పింగాణీపాత్రలకు నగిషీలు అద్దాలనుకున్నాడు. కొన్ని ఏళ్లు ఎన్నో ప్రయోగాలు చేశాడు.పింగాణీపాత్రలు తయారుచేయటం వాటిని కాల్చి ఎనామిల్ రంగులు అద్దటంలో విఫలుడైనాడు.కొలిమిలో కట్టెలకోసం ఇంట్లో ఉన్న కుర్చీ మంచంకూడా విరక్కొట్టి కట్టెల్ని కొలిమిలో వేసి భార్య చిటపటలను భరించాడు. అంతా పిచ్చివాడని హేళన చేసినా భరించాడు. ఆరోజు కొలిమి ఆరినాక చూశాడు.ఆశ్చర్యం!! ధగధగ మెరుస్తూ ఎనామెల్ కన్పడింది.అంతే పింగాణి సామాన్లకి ఎనామెల్ పెయింట్ పద్ధతి కనుగొని అఖండ కీర్తి పొంది చరిత్ర లో నిలిచాడు.🌹
స్ఫూర్తిప్రదాతలు 91:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి