స్ఫూర్తిప్రదాతలు 94:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒడిషాలోని కెందుజార్ లో ఉత్కళ్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విదేశాల నుంచి గెస్ట్ లెక్చరర్లు వస్తుంటారు.12వక్లాస్ దాకా యూనిఫాం పుస్తకాలుఫ్రీ.దానికి మూలం డాక్టర్ ప్రదీప్ సేథీ.అమ్మ నాన్నలు కూలీలు.9వ ఏటనుంచి గంజితాగి (అదీ ఒక్క పూట 
 మాత్రమే ) 12వ ఏట నవోదయ స్కూల్ లో చేరి మెడిసిన్లో సీటు సంపాదించిన తర్వాత ఫీజుకోసం ఇల్లు అమ్మి గనికార్మికునిగా పనిచేశాడు.ఢిల్లీ లో డెర్మటాలజీ చేసి రుషికేష్ లోక్లినిక్ పెట్టాడు.బట్టతల సమస్య వారికి దైవంగా మారాడు.కోచింగ్ సెంటర్ పెట్టాడు తన పల్లెలో.క్రమంగాదాన్ని బీద పిల్లల పాలిట కల్పవల్లిగా మార్చిన ఘనత ప్రదీప్ సేథీదే సుమా!మల్లెలా గుబాళిస్తుంది ఆబడి.కారణం! ఎస్.డి.సి పనితీరు ప్రోత్సాహం! మంగుళూర్ కిందకి.మీ.దూరంలో ఉన్న  ఓజల ప్రైమరీ స్కూల్ కోసం ఆఊరివారు కమిటీ వారు కాంట్రాక్ట్ టీచర్ల తో బడి నడుపుతూ జీతాల కోసం బడి పరిసరాల్లో మల్లెమొక్కలు నాటారు. గ్రామస్థులు పిల్లల సంరక్షణ లో మల్లెపూల వ్యాపారంచేస్తూ బ్యాంకులో జమచేస్తారు. అలా వచ్చిన డబ్బుల తో ఫర్నిచర్ మరుగుదొడ్లు 7వక్లాస్ దాకా పిల్లలకు చదువు వసతి ఏర్పాటుచేసి దాదాపు 150మంది విద్యార్థులు మల్లెల ఘుమఘుమ లతోపాటు కరాటే డాన్స్ యోగాతో అలరారుతోంది.ఆబడి కమిటీని ఊరివారిని అభినందించాల్సిందే సుమా🌹
కామెంట్‌లు