మన దేవుడు:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
దేవుడు దేవుడు దేవుడు
నీలో నాలో అతడున్నాడు
మదిలో అతనిని ఆరాదిస్తే
కనబడతా అని అన్నాడు !

దేవుడు దేవుడు దేవుడు
నీలో నాలో కాకుండా మరి
మన అందరి మదిలో కూడా
అతను గుప్తంగా దాగున్నాడు !

దేవుడు దేవుడు దేవుడు
మనలో ఉన్న మాధవుడు
మన కంటికి కనబడకుండా
ఉంటాడు మన మది నిండా  !

దేవుడు దేవుడు దేవుడు
అందరి మదిలోని జీవుడు
ఆరాధిస్తే మన మాధవుడు
తా వరమును అందిస్తాడు !

దేవుడు దేవుడు దేవుడు
బొందిలో దాగిన జీవుడు
మన భక్తికి అతను బంది
మన కుండదులే ఇబ్బంది !

దేవుడు దేవుడు మన దేవుడు
ఇలలో అతనే ఘనా ఘనుడు
మన మనసారా తనని పూజిస్తే
అందించే భోగభాగ్యాలిక  మస్తే !

దేవుడు దేవుడు ఈ మన దేవుడు
లోకాలను పాలించే మహాదేవుడు
కొలచితలచే ఇందీవరశ్యాముడు
అయ్యాడు అనంత పద్మనాభుడు

దేవుడు దేవుడు మన ఈ దేవుడు
మదిలో పదిలంగా ఉన్న జీవుడు
భువి దివి తాకిన మన వామనుడు
మన మదిలోమెరిసే విరిసే ఇనుడు

దేవుడు దేవుడు మన ఈ దేవునికి
మన నూతన సంవత్సర వందనం 
అర్పిద్దాం సుమ సిరి అభివందనం
 సమర్పిద్దాం మన నందనందనం !


కామెంట్‌లు