ససేమిరా :- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా

 స-సే-మి-రా అను అక్షరముల వెనకున్న కథ ఏంటో మీకు తెలుసా బాలలు? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి ఆ కథను.
పూర్వం విశాల అను నగరాన్ని నందుడు అను రాజు పరిపాలించుచుండెను. అతనికి సంతానం కానందున బ్రహ్మను గూర్చి తపస్సు చేశేను. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడగగా"బ్రహ్మదేవా! వంశాన్ని నిలబెట్టే ఓ కొడుకును ప్రసాదించమని కోరాడు. ఆ వర ప్రభావంచే జయంతుడు అను కుమారుడు కలిగెను. అతన్ని అల్లారుముద్దుగా పెంచసాగెను.
          జయంతుడు గారాబంగా పెరిగినందున అతడు ఎవరి మాటను వినేవాడు కాదు. ఒకరోజు అడవికి వేటకు వెళ్తానని మంకుపట్టు పడ్డాడు. తండ్రి చెప్పినా, మంత్రులు వలదని చెప్పినా వినకుండా వేటకు వెళ్లాడు. వేటాడి వేటాడి అడవిలో అలిసిపోయి ఒక చెట్టు నీడన పరుండెను. ఇంతలో పులి ఒకటి గాండ్రు గాండ్రు మని ఆరుచుచు రాగా జయంతుడు భయపడి చెట్టు పైకి ఎక్కెను. కానీ ఆ చెట్టుపై ఒక బల్లుకము ఉండెను. దానిని చూసి అతడు వనక సాగెను. అప్పుడు"భయపడకు మానవా! నేను నిన్ను ఏమి చేయను"అని అభయమిచ్చి తన ఒడిలో అతనిని పరుండ పెట్టుకొనెను. హాయిగా జయంతుడు నిద్రలోకి జారుకునెను.
         చెట్టు క్రింద ఉన్న పులి"ఓ బల్లూకమా! ఈ మానవులు నీకును నాకును శత్రువులే కదా! వానిని ఏల కాపాడేదవు? వానిని క్రిందకు త్రోసివేయుము. నేను భక్షించెదను. అని అనెను. కానీ శరణు జొచ్చిన వానిని కాపాడేదను గాని విడువ"అని భలోకము గట్టిగా చెప్పెను
             జయంతునికి నిద్రాభంగం కలిగి లేచిన ఫిదప తాను నిద్ర పోగోరి భద్రముగా చూస్తుండమని బల్లూకము జయంతునితో చెప్పెను. అతను సరే అని బల్లూకము నిద్రపోయిన పిమ్మట పిమ్మట క్రింద ఉన్న పులి"రాజపుత్రా ! నీవు ఆ బల్లూకమును నమ్ముకున్నావా! ఎంత వెర్రివాడవు? అది నిన్ను  మింగి వేయును సుమా "అని దాన్ని క్రిందికి త్రోసివేయుము. నేను దాన్ని బక్షించదా. నీవు అప్పుడు చెట్టు దిగి వెళ్ళిపోవచ్చు గదా అని చెప్పాను. జయంతుడు మంచి చెడ్డలు ఆలోచించక ఆ భల్లూకమును క్రిందికి తోసేను. కానీ బల్లూకము క్రింద పడకుండా చుట్టుకొమ్మను పట్టుకొని తనను తాను రక్షించుకొనెను. కృతఘ్నడగు జయంతుని మతి బ్రష్టుడగునట్లు శపించెను.
           అప్పటినుండి అతనికి "ససేమిరా"అను మాట కంటే వేరు మాట రాకుండె. ఎవ్వరేమి అడిగినా ససేమిరాయని మాత్రమే జవాబిస్తుండెను. ఇట్లు మతి చెడి తిరుగుచున్న పుత్రుని చూచి తండ్రి నందుడు దుఃఖించి అతనికి చికిత్స చేయించుటకు అనేక ప్రయత్నాలు చేసెను. తుదకు పూర్వము అతనిచే వెడలగొట్టబడిన మంత్రి శతానందుడను వాడు ఓ కన్య రూపమున వచ్చి స-సే-మి-రా అను అక్షరముతో ప్రారంభించు శ్లోకంతో ఆ బల్లూకము కథను చెప్పాను. ఆ కథ విని జయంతుడు తన మతి బ్రష్టతను కోల్పోయి స్వస్థత నొందెను. తన తండ్రి సంతోషించెను.
       ఇప్పుడు తెలిసిందా!
బాలలు సాసేమిరా వెనుకున్న అసలు కథ.

కామెంట్‌లు