సూక్తి సుధ!:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
1). అజ్ఞానాన్ని తొలగించుకో
     విజ్ఞానాన్ని ఇక పెంచుకో
     ఇవి జీవితాన్ని సరిదిద్దు
     వీటిని నీవిక మరవద్దు  !

2). శక్తి కోసం భుజించాలి
      భక్తి కోసం భజించాలి
      ముక్తి కోసం పూజించాలి
      రత్తి కోసం ఆనందించాలి !

3). తప్పటడుగులు వేయొద్దు
     తప్పుడు త్రోవలో నడవద్దు
     అత్యాశలో ఇక పడవద్దు
      ఆశకు పరిధి ఉంటే ముద్దు !

4). మన మానవ బలం కన్నా
     దివ్యమైన దైవ బలమే మిన్న
     అని తెలుసుకోవాలిక  నీవన్న
     తెలియకుంటే నీ జీవితం సున్న 

5). మన తల్లి తండ్రి గురువులు
     మన యొక్క ప్రత్యక్ష దైవాలు
     మనం సదా వీరిని పూజించాలి
     మనవారు వీరని భావించాలి !

6). నీ నిస్వార్థమే పురోగతి
     నీ స్వార్థమే అధోగతి
     నీ ప్రయత్నమేగా ప్రగతి
     అదే సదా నీ గతి సద్గతి !

7). చెడుకు స్వాగతం తప్పు
     మంచికి సుస్వాగతం చెప్పు
     తలకు మించి చేస్తే నీవు అప్పు
     జీవితానికి తెచ్చి అది ముప్పు !

8). నీవు అందరినీ ప్రేమించు
      పొరుగువారిని ఆదరించు
      కలిసిమెలసి ఇక జీవించు
      అంతా మనవారని భావించు !

9). ప్రతిఫలాన్ని  ఆశించకు
     ప్రశంసలను కాంక్షించకు
     శత్రుత్వాన్నిక  పెంచకు
     శాశ్వతంగా తలదించకు !

10)  నాది నాది అన్నది
      నీ వెంట ఏది రాదు
      నీ వెంట వచ్చే నీడ
      నిన్ను విడిచి పోదు !


కామెంట్‌లు