నిండు జాబిలి!:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
నిండు జాబిలి వచ్చింది
పండు వెన్నెల ఇచ్చింది
నిన్ను నన్ను రమ్మంటూ
కన్ను సైగను తాచేసింది !

పండు వెన్నెల వచ్చింది
వెండి వెలుగుల ఇచ్చింది
ప్రేమ జంటలను మెచ్చింది
ప్రేమ మాలలను గుచ్చింది !

నిండు పున్నమి వచ్చింది
పండు వెన్నెలను ఇచ్చింది
విరహ వేదనను పెంచింది
మరి నిన్ను నన్ను కలిపింది !

నిండు జాబిలిరేడు వచ్చిండు
పండు జాబిలమ్మని మెచ్చిండు
తాను ప్రేమ ఫలాలను  ఇచ్చిండు
 తా జాబిలమ్మ  ప్రేమకు చిక్కిండు 

ఆ ప్రేమలో పడిన జాబిలమ్మ
మురిసి వి

రిసిన ఓ ప్రేమ కొమ్మ
రేరాజు ముద్దుల సుద్ధుల గుమ్మ
ప్రేమ విందుకు నువు రావమ్మ  '

మనలను కలిపిన రారాజు
తీర్చను మన ప్రేమ మోజు
జరుగేదే ఇలలోన ప్రతిరోజు
జీవిత గమనంలోన రివాజు

కామెంట్‌లు