పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జలదృశ్యం: -గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జలదృశ్యం వల్ల
ఘన తెలంగాణలో అవుతుంది కరువు పూర్తిగా అదృశ్యం మల్ల !

కృష్ణమ్మ పరవళ్ళతో మన బీడు భూములన్ని బాగా తడసిపోవు
కష్టించే మన రైతుల మనసులన్ని
ఇబ్బడి ముబ్బడిగా మురిసిపోవు !

ఈ ఎత్తిపోతల జలాలతో  కళకళ లాడు మన ప్రాంతం పొలాలు
తీరని దాహాన్ని తీర్చుకొని ఇక పరవశించి పోవు మన గళాలు !

మనపాలమూరు జిల్లా రైతుల 

స్థితిగతులను కెసిఆర్ గ్రహించి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును
చేపట్టెను ఇక తాను సాహసించి !

పాలమూరు ఎత్తిపోతలే ఆయన లక్ష్యం
ఔతుందది మన పాలిటి కల్ప వృక్షం
భూ సేకరణ చేయుట అందుకు సాక్ష్యం
చెరువులు దొరువులు ఇక తెరిచే గవాక్షం!

కలకాలం ప్రవహించే కాలువల త్రవ్వించి
కకావికలైన మనబతుకులను దీవించి
రాత్రి పగలు తన ఆలోచనలతో మదించి
కెసిఆర్ గారు అపర భగీరథుడాయే సాధించి !

మన కృష్ణమ్మ గోదావరి వరద జలాలు
వేగంగా పారంగా నిండిపోవు పొలాలు
అంగరంగ వైభవంగా పండుతాయి పంటలు
శీగ్రంగా నిండిపోవు ధాన్యాగారం గుంటలు!

కామెంట్‌లు