గాయకుడనై గాయపడ్డ !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491487977.-నాగర్ కర్నూల్ జిల్లా.
చిల్లర మల్లర
కోతలు కోసి
అల్లరి వల్లరి
పాటలు రాసి
నే గాయకుడై
పోవాలనుకున్న
చిత్ర సినిమాలో
చేరాలనుకున్న !

అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి
అను పాత పాట
గుర్తుకొచ్చే నాకు
యత్నించి బాగా
ప్రయత్నించి నేను
నా ఆశను అడియాస
చేసుకున్నాను !

నే సొంతంగా వ్రాసిన
పాటలు మాటలను
షార్ట్ ఫిలిం తీసి వారికి
పంపి మోసపోయాను
ఆ పంపిన మాటలు
పాటలు వారు వారి
చిత్రంలో వాడుకొని
నన్ను గాలికి వదిలి
మోసగించారు!

అప్పటినుంచి నేను
గాయపడ్డ గాయకుడనై
మిగిలిపోయాను. నాలోని
ఆశలన్నీ అడియాసలై చిన్ని
చిత్రాలు తీసే వారిపై నేను
రగిలిపోయాను ! ఉట్టికి
ఎక్కనమ్మ స్వర్గానికి 
ఎక్కినట్లయే నా పని 


కామెంట్‌లు