గోపాలా గోపాలా గోపాలా
పడ్డావు ఈరోజు మా పాలా
వెలిగించాము నీకు దీపాలా
తొలగించరావా మాశాపాలా !
గోపాల గోపాల ఓ గోపాలా
ఓ మా మంచి చిన్ని గోపాలా
మేమంతా గోవిందా గోవిందా
అని నిన్ను ఈ రోజు పిలవాలా !
మేమంతా నిన్ను అలా పిలవాలా
అలా పిలిస్తే మమ్ము నీవు చేరాలా
చేరి నీవు మరి మా కోరిక తీర్చాలా
తీర్చినీవే మా బ్రతుకుల మార్చాలా
గోపాల గోపాల ఓ మా గోపాలా
నీవేలే మామంచి చిన్ని గోపాలా
మా లోగిలి మంత్రాలను వినాలా
మా పూజకు నీవు ఇంక రావాలా
గోపాల గోపాల ఓ మా గోపాలా
దూరంగా ఉన్నావు నీవెందుకిలా
చెప్పి నువ్వు పోగొట్టు సందేహాలా
ఆపై నీవే వచ్చి మమ్మిక ఎలాలా !
గోపాల గోపాల మా చిన్ని గోపాలా
తొలగించలేవా నీవు మా పాపాలా
మామొరవిని నీవే మాదరి చేరాలా
మా కోరిన వరములను నీవే ఇవ్వాలా!
గోపాల గోపాల ఓ మా గోపాలా
మా కష్టాలను నీవే ఇక ఆపాలా
మా మోక్షానికి తోవను చూపాలా
చూపి పుణ్యమును అందించాలా !
గోపాల గోపాల ఓ మువ్వ గోపాలా
నీసన్నిధి చేరుటకు దారి చూపాలా
మా బతుకులో హాయి వెలిగించేలా
సుఖాల ఉయ్యాల నువు ఊపాలా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి