స్ఫూర్తిప్రదాతలు 95:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
 
బీహార్ కిచెందిన రాజ్ కుమార్ సింగ్ కి ఏకంగా 7గురు ఆడపిల్లలు.పిండిమర నడిపే ఆతండ్రి ప్రోత్సాహంతో ముగ్గురు పోలీసుశాఖ లో మిగతా నలుగురు ఇతరరక్షణశాఖల్లో జాబ్ చేస్తూ పెద్ద బంగ్లాకట్టారు. జేజేలు ఆతండ్రి కూతుళ్లకి. 
తూర్పుగోదావరికి చెందిన మల్లంపూడిలో సాఫ్ట్ వేర్ కిరణ్  గాడిద పాలవ్యాపారం ప్రారంభించాడు.120గాడిదలతో లీటర్ 7వేల రూపాయల తో మూత్రం 400తో వ్యాపారం చేస్తున్నాడు.భారత్లో తొలిసారి కేరళవాసి అబిబేబీ అనే సాఫ్ట్ వేర్ 30గాడిదలఫామ్ తో కాస్మోటిక్స్ తయారుచేసి లాభాల బాట పడుతున్నాడు.ప్రపంచంలోనే దివ్యాంగులకు యూనివర్శిటీ ఏర్పాటుచేసిన ఘనత జగద్గురు రామభద్రాచార్య గారికే దక్కుతుంది.అది యు.పి.లోని చిత్ర కూట్ లో2001 లోఉచిత చదువువసతి నెలకొల్పిన ఆయన 2నెలల వయస్సులో ట్రకోమాతో చూపుకోల్పోయిన ఆయన గిరిధర్ మిశ్ర.తోటిపిల్లలు ఏడిపిస్తుంటే తాతగారు ఆపసివాడ్ని లాలిస్తూ భగవద్గీత రామచరితమానస్ నేర్పారు. 10వ ఏట పెళ్లి ఊరేగింపుతో నడుస్తున్న ఆయన్ని జనాలు గెంటేశారు.అంతే చదువుపై దృష్టిపెట్టి వక్త్తృత్వపోటీల్లో 5బంగారుపతకాలు సంస్కృతంలో ఎం.ఎ.పి.హెచ్.డి.చేసి1987లో చిత్ర కోట్ లో తులసీపీఠం నెలకొల్పారు.దివ్యాంగులైన అధ్యాపకులు దేశ విదేశాల నుంచి ప్రొఫెసర్స్ వస్తారు.22భాషల్లో పండితుడు 200పుస్తకాల రచయిత జ్ఞాన పీఠ గ్రహీత పేదల కోసం100పడకల ఆస్పత్రిని నెలకొల్పారు.ఈయనని గూర్చి పాఠ్యాంశంగా పిల్లల కి అందజేయడం సముచితం🌷

కామెంట్‌లు