స్ఫూర్తిదాతలు 97సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 నిశా మధులిక యూట్యూబ్ వంటలతో కోటాధిపతి ఐంది.ఎన్నో వెబ్సైట్స్ లో ఫుడ్ కాలమ్స్ రాస్తుంది.టీచర్ గా పనిచేసిన ఆమె భర్త బిజినెస్ లో పాలుపంచుకుంటూ ఇద్దరు పిల్లల తల్లిగా 52వ ఏట వంటలరుచులు విశ్వానికి పంచనారంభించింది.యూట్యూబ్ షెఫ్ గా 2017 లోయూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ గా అవార్డుపొందింది.ఆమె యూట్యూబ్ ఫేస్బుక్ తో 43కోట్లు ఆర్జించిన మహిళగా నిల్చిందిమేరీ ఆనంద్ రాజ్  దంపతుల కృషి పోరాటంతో తమిళనాడులో ఆసుపత్రులకు దిమ్మతిరిగింది. ప్రభుత్వం నడ్డివిరిగింది.బాల్యంలో ఆసుపత్రుల నిర్లక్ష్యంతో తండ్రిని కోల్పోయిన ఆనంద్ రాజ్ డిగ్రీ ఐనాక ఎవిడెన్స్ అనే ఎన్జీవో లో చేరి పరువుహత్యలకి సవాల్ విసిరాడు. మధురై గవర్నమెంట్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందుల శవాలను చూశాడు.ఇన్ క్యుబేటర్ సౌకర్యాలకొరతతో పిల్లలు ఏటా 700మంది చనిపోతున్నారు అని తెలుసుకున్నాడు.ప్రజాహితవ్యాజ్యం పిల్ వేశాడు.హైకోర్టు దెబ్బ కి ప్రభుత్వం దిగొచ్చింది. ఆదంపతుల పోరాట ఫలితంగా జిల్లాల ఆసుపత్రుల లో ఎమ్మారై వసతులు చెవి దంతసమస్యలకు చికిత్సలు ప్రారంభమైనాయి.తమిళనాడు రాష్ట్రం జీరో అడ్మిషన్ ప్రొసీజర్ పథకాన్ని ప్రవేశ పెట్టేలా చేసిన ఘనత వీరిదే.బీహార్ మారుమూల ప్రాంతాల్లోలేడీ టీచర్లు సరిగ్గా పనిచేయకపోటం డుమ్మాలు కొట్టడంతో విద్యాశాఖ వారికి స్కూటీ నడపటంనేర్పింది. కొత్త వారికి నేర్పిరాయితీలతో స్కూటీలు కొనడానికి చేయూత నిచ్చింది.ఇప్పుడు లేడీ టీచర్లు రయ్ రయ్ న బడికొస్తున్నారు.ఒక్క దెబ్బ కి రెండు పిట్టలు బాగుంది కదూ?🌹
కామెంట్‌లు