మహాత్ముల మాటలు:- -- గద్వాల సోమన్న,9966414580
కవీంద్రుల బలము కలము
రైతన్నల ఆస్తి పొలము
నైతిక విలువలు మనిషికి
ఉంటేనే ఘనము ఘనము

విలువైన బహుమతి చెలిమి
ఇల వాడబారని కలిమి
చేయకూడదోయ్! ద్రోహము
చేస్తే గనుక దారుణము

ఈర్ష్య కాల కూట విషము
కాకూడదోయ్! దాని వశము
ఇది జగమెరిగిన సత్యము
అనిశము గుర్తించుకొనుము

హానిచేయును కల్లలు
కాల్చివేసే మంటలు
క్రుంగజేయును  మనసులు
అగును పతనం బ్రతుకులు


కామెంట్‌లు