పిల్లల ప్రతిన!:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
మొక్కలెన్నొ నాటుతాం
పచ్చదనము పంచుతాం
అక్కరలో సాయపడి
చుక్కల్లా వెలుగుతాం

శ్రమదానం చేసేస్తాం
పరిశుభ్రత పాటిస్తాం
పెద్దలను గౌరవించి
వినయాన్ని చూపిస్తాం

దేశకీర్తి నిలబెడుతాం
దేశభక్తి చూపెడుతాం
ఎచ్చోటికి వెళ్ళినా
అచ్చోట ఎదిగేస్తాం

నీతినే కల్గియుంటాం 
జ్యోతిలా ప్రకాశిస్తాం
ప్రీతినే పంచిపెట్టి
భీతినే తరిమిస్తాం

నిప్పులాగ జీవిస్తాం
నిజాయితీని చాటుతాం
క్రమశిక్షణ కల్గియుండి
కాంతిపుంజమవుతాం 

చదువులెన్నో చదువుతాం
జీవితాన ఎదుగుతాం
దేశానికి పేరు తెచ్చి
భరతమాతను మెప్పిస్తాం


కామెంట్‌లు