పరీక్ష: - ఎన్.పూజ 9వతరగతి స్ప్రింగ్స్ హైస్కూల్, హైదరాబాద్
 ఉడుత ఎలుక కుందేలు మంచి స్నేహితులు.రోజూ పడవలో  కోతి వాటిని ఆవలిదిక్కుకు షికారుగా తీసుకుని వెళ్లేది.ఓవారం గడిచాక కోతికి ఓఆలోచన వచ్చింది.వాటి స్నేహాన్ని పరీక్షించాలనుకుంది.కాస్త దూరంలో నీటిలో నావ ఆగిపోయింది." బరువెక్కువైంది.ఒకరు నీటిలోకి దూకాలి. " ఎలుకను బలవంతంగా నీటిలోకి తోశాయి కుందేలు ఉడుత. ఇంకొంచెం దూరంపోయాక నావ ఆగింది.ఉడతను నీటిలోకి తోసిన కుందేలు అంది" కోతి బావా! త్వరగా నన్ను ఒడ్డున చేర్చు." కోతి అంది" మీముగ్గురూ నిజమైన స్నేహితులుకాదు. స్వార్ధపరులు. నిన్ను కూడా నీటిలోకి తోసేస్తా.మిమ్మల్ని పరీక్షిస్తున్నా" అంటూ కుందేలును నీటిలోకి తోసింది. పక్కనే ఓపెద్ద తాబేలుపై ఎలుక ఉడత అరిచాయి" అరే కుందేలూ!తాబేలు వీపుపైకి దూకు". అప్పుడు కోతి తాబేలుతో సహా అన్నింటినీ నావలోకి ఎక్కించి అంది" ఆపదలో సహాయపడేవాడు నిజమైన స్నేహితుడు."🌺

కామెంట్‌లు